ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.
ఆగస్టు 30న వారి ఖాతాల్లో తల్లికి వందనము రూ.13,000 జమ..స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి! | Thalliki Vandanam August 30 payment update
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందిస్తున్న Thalliki Vandanam పథకంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆగస్టు 30న రూ.13,000 చొప్పున జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గత నెలలో అర్హత ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా Thalliki Vandanam payment అందని వారికి కూడా ఇదే తేదీన నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే అర్హత పొందిన కుటుంబాలకు ఈసారి చెల్లింపు అందే అవకాశం ఉంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా Thalliki Vandanam DBT ద్వారా నగదు బదిలీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా, Thalliki Vandanam application కోసం ఇంకా అవకాశం ఉంది. అర్హత ఉన్న విద్యార్థుల తల్లులు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య సుమారు 2.78 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న కుటుంబాలు గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నారు.
| ముఖ్యమైన వివరాలు | సమాచారం |
|---|---|
| పథకం | Thalliki Vandanam |
| చెల్లింపు తేదీ | ఆగస్టు 30 |
| నగదు సాయం | రూ.13,000 |
| వర్తించే విద్యార్థులు | ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ |
| దరఖాస్తు గడువు | ఆగస్టు 25 |
| అంచనా కొత్త లబ్ధిదారులు | 2.78 లక్షలు వరకు |
Thalliki Vandanam amount నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. గత నెలలో సాంకేతిక కారణాలతో చెల్లింపు నిలిచిపోయిన వారు కూడా ఆగస్టు 30న ఖాతాలో నగదు వచ్చిందో లేదో బ్యాంకు లావాదేవీలు లేదా సంబంధిత అధికారిక సేవల ద్వారా పరిశీలించుకోవచ్చు. ఈ Thalliki Vandanam latest updateతో అర్హులైన కుటుంబాలకు ఊరట లభించనుంది.
☑️ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేశారా? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
☑️ ఆగస్టు 26న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..ప్రభుత్వం కీలక ప్రకటన
☑️ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి డ్వాక్రా మహిళలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం
ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.






